Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page

అర్థములు
శ్రీ సూరి రామకోటిశాస్త్రి
(సంస్కృత కళాశాల పూర్వాధ్యక్షులు, తెనాలి)

పుట 5 ''వసుదేవసుతం''

వసుదేవసుతం = వసుదేవుని కుమారుడును, దేవకీ పరమానన్దం = దేవకీదేవికి పరమానన్దకరుడును, కంసచాణూరమర్దనం = కంసుని, చాణూరుని, మర్దించినవాడును, జగద్గురుం = సమస్త ప్రపఙ్చమునకు జ్ఞానోపదేష్ట అగు, కృష్ణదేవం = శ్రీ కృష్ణ పరమాత్మకు, వందే = నమస్కరించుచున్నాను.

పుట 12 ''శాన్తాః''

శాన్తాః = రాగద్వేషములకు వశముకానివారై, మహాన్తః = గొప్పవారు, సన్తః = సత్పురుషులు, వసన్తవత్‌ = వసన్తమువలె, లోకహితంచరన్తః = లోకమునకు మేలుకలుగునట్లుగా నడచుచు, నివసన్తి = నివసించుచున్నారు.

పుట 16 ''యస్వభావో''

యస్య = ఎవనికి, భావః = భావము; అహం కృతఃన = అహంకారముచే చేయబడినది కాదో! యస్య = ఎవనియొక్క చిత్తం = మనసు=, నలిప్యతే = రాగద్వేషములచే అంటబడదో, సఃఆయం అయీ మనుజుడు ; ఇమాన్‌ లోకాన్‌ = ఈ లోకములను, హత్వా అపి = చంపియు, న హన్తి = చంపుటలేదు, న హన్యతే = చంపబడడు.

పుట 24 ''ఆనన్దం''

ఆనన్దం = ఆనన్దమును, బ్రహ్మఇతి = బ్రహ్మ అని, వ్యజానాత్‌ = తెలిసికొనెను. రసోవైసః = సః = ఆ ఆత్మ; రసః వై = ఆనంద స్వరూపుడే.

'' ''నిర్దోషం హి సమంబ్రహ్మ''

బ్రహ్మ = శుద్ధము, దోషములేనిది, ఏకరూపముగా ఉండునది కదా!

పుట 34 ''ఏతాన్‌ ధర్మాన్‌ సమాసేన''

అహింస, సత్యము, అచౌర్యము, ఇంద్రియనిగ్రహము ఇవి మానవులందఱికి ధర్మములు.

పుట 36 ''హనుమత్‌స్మరతాత్‌''

హనుమత్‌ స్మరణాత్‌ = హనుమంతుని స్మరించుటవలన; బుద్ధి ్శ తెలివి, బలం = బలము, యశః = కీర్తి, ధైర్యం = నిబ్బరము, నిర్భయత్వం = భయము లేకపోవుట, ఆరోగతా = ఆరోగ్యము, అజాడ్యం = జడత్వముతొలగుట, వాకృటుత్వంచ = వాక్పాటవము (మాట్లాడుటలోనేర్పు) భ##వేత్‌ = కలుగును.

పుట 38 ''అమృతా పిధానమసి''

అమృత = (భుజించిన ఆహారము) అమృతమునకు; అపిధానం = అచ్ఛాదనము, అసి = అయితివి, అపుణ్యనిలయో = పాపులకునివాసమగు; రౌరవే = నరకమందు, పద్మార్బుదనివాసినాం పద్మ అర్బుద (కోట్ల) సంఖ్యలో నివసించు, అర్ధినాం = జీవులకు; ఉదకం = నీరు; దత్తం = ఇవ్వబడినది, అక్షయ్యం = అక్షయమై, ఉపతిష్టతు = చేరి తృప్తి నిచ్చుగాక.

పుట 48 ''భగవతి''

భగవతి! ఓ పరమేశ్వరీ!భద్రార్థదే = మఙ్గళవస్తువుల ప్రసాదించుదానా! మమ = నాకు, భవభంగకరీం = సంసారమును పోగొట్టునట్టి; భక్తిం భక్తిని, ప్రసీద = అనుగ్రహింపుము.

పుట 46 కాతే కాన్తా? కస్తే పుత్రః?

తే = నీకు, కాన్తా = భార్య, కా = ఎవరు? తే = నీకు, పుత్రః = కుమారుడు; కః = ఎవ్వడు?

పుట 48 ''యస్యనాహం కృతోభావః''

- 16 పేజీలో వ్రాయబడినది; ('యస్యనాహంకృతో భావః') ఆపది = ఆపత్తులో, కిం కరణీయమ్‌ = ఏమిచేయదగినది? అమ్బాయాః = (పరమేశ్వరి) జగన్మాతయొక్క, చరణయుగళం = పాదద్వంద్వము; స్మరణీయం = స్మరింపతగినది.

( 9 - 27 )

పుట 49''శివ శివ''

శివ! శివ! = శివ! శివా! (భగవన్నామము) శ్రీ కామాక్షీకటాక్షితాః పురుషాః = శ్రీకామాక్షీదేవీకటాక్ష వీక్షణములకు పాత్రులైన పురుషులు విపినం భవనం = అరణ్యమును, గృహమును. అమిత్రం మిత్రం = శత్రువును, మిత్రుని. లోష్టం యువతిబింబోష్ఠంచ = మట్టి గడ్డను, యువతిబింబాధరమును. సమంపశ్యన్తి = సమముగా చూతురు.

పుట 50 16, 48 లలో వచ్చినది వ్యాఖ్యానింపబడినది.

పుట 51 ''యత్రయోగేశ్వరః''

యత్ర = ఎచట, యోగేశ్వరః = యోగిజనులకు ప్రభువుమహాయోగి, కృష్ణః = శ్రీకృష్ణుడు, యత్ర=ఎచట, ధనుర్ధరః = గాండీవధనుసు=ధరించిన, పార్థః = అర్జునుడు; (ఉందురో) తత్ర = అచట; శ్రీః = లక్ష్మియు, విజయః = విజయము, భూతిః = సంపద, ధ్రువానీతిః = నిలకడగల నీతియు; అని, మమ మతిః = నాయభిప్రాయము.

పుట 57 ''విందసియజ్ఞవిధేః''

అహహ ! = ఆహా ! సదయహృదయ ! = దయతో కూడిన హృదయముగలవాడా ! యజ్ఞవిధేః =యాగమునువిధించుటవలన; దర్శితపశుఘాతం = పశుహింసను ఆమోదించిన, శ్రుతిజాతం = వేదసమూహమును, నిందసి = నిందించుచున్నావు.

పుట 58 ''మౌనంముక్త్వా''

మౌనం ముక్త్వా =మౌనమును విడనాడి, పటవిటపినః = మఱ్ఱిచెట్టు యొక్క, మూలతః = మొదటినుండి, నిష్పతన్తీ = బయలుదేరి వచ్చుచున్న, శంభోఃమూర్తిః = శివుని అవతారము దక్షణామూర్తి, భువనే = లోకమున, శంకరాచార్యరూపా = శఙ్కరభాగవత్పాదరూపమున, చరతి = తిరుగుచున్నది.

పుట 58 ''విచరన్తి''

విచరన్తి మహామహనః చలతః = మహాజ్యోతి సాక్షాత్‌ శంకరులే, శంకరాచార్యరూపముగా భూమి మీద లోకానుగ్రహమునకై తిరుగుచున్నారు.

పుట 62 ''ఏకంసత్‌ విప్రా బహుధా వదన్తి''

విప్రాః = విజ్ఞులు, ఏకంసత్‌ = ఒకే సద్వస్తువును పరతత్త్వమును; బహుధా = బహువిధములుగా అనేక నామములతో, వదన్తి = పలుకుచున్నారు.

పుట 63 ''మనుష్యాణాం సహస్రేషు''

మనుష్యాణాం సహస్రేషు = వేలకొలది మనుష్యులలో ; కశ్చిత్‌ = ఒకానొకడు; సిద్ధయె = సిద్ధికొఱకు, (తరించుటకు) యతతి = ప్రయత్నించుచున్నాడు. యతతాం సిద్ధానామపి = ప్రయత్నించు సిద్ధులలో ; కశ్చిత్‌ = ఒకానొకడే, మాం = నన్ను; తత్త్వతః= యథార్ధముగా , వేత్తి = తెలిసికొనును.

పుట 64 ''ఉర్వారుకమివ''

బంధనాత్‌ = తొడిమనుండి, ఉర్వారుకమివ= దోసపండువలె, (అహం = నేను) మృత్యోః = మృత్యువునుండి, ముక్షీయ = విడిపడుదునుగాక.

'' ''సరస్వత్యా లక్ష్మ్యా''

త్వధ్భజనవాన్‌ = పరమేశ్వరిభక్తుడు; సరస్వత్యా = సరస్వతి (విద్య) చేతను, లక్ష్మ్యా = లక్ష్మి (ఐశ్వర్యము) చేతను; విధి హరి సపత్నః = బ్రహ్మవిష్ణువులకు ప్రతిపక్షుడై (విద్త్యెశ్వర్యములచే) విరాజిల్లుచు; విహరతే = విహరించును; రమ్మేణవపుషా = అందమైనశరీరవముచేత, రతేః = రతీదేవియొక్క, పాతివ్రత్యం పతివ్రతాత్వమును, శిథిలయతి = సడలించును. చిరంజీవన్‌ ఏవ = చిరకాలము జీవించుచునే క్షపితపశు, పాశవ్యతికరః = జీవపాశబంధమును త్రెంచుకొనినవాడై, రసంపరానందాఖ్యం = పరమానన్దరసమును; రసయతి = ఆస్వాదించును.

పుట 67 శివశివ పశ్యంతి :- 49 లో వ్రాయబడినది.

పుట 68 శాంతామహోన్తో :- 12 లో వ్రాయబడినది.

పుట 70 మనుష్యాణాం :- 63 లో వ్రాయబడినది.

పుట 71 ''యేయథామాం''

యే = ఎవరు, యథా = ఎట్లు,మాం = నన్ను, ప్రపంద్యంతే = (శరణుపొందు) సేవించుచున్నారో; తాన్‌ - వారిని, తథైవ = అట్లే; అహం = నేను, భజామి = అనుగ్రహించుచున్నాను. ఆకాశాత్‌=ఆకాశమునుండి, పతితం = పడిన, తోయం = నీరు, యథా = ఎట్లు, సాగరం= సముద్రమును, గచ్ఛతి = పొందుచున్నదో, సర్వదేవనమస్కారః= ఏదేవునికి చేసిననమస్కారమైనను, కేశవం ప్రతిగచ్ఛతి= విష్ణువను చేరును. తస్య = ఆ పరమాత్మ యొక్క, భాసా = ప్రకాశముచేత, ఇదం సర్వం = ఈ జగమంతయు, భాతి = ప్రకాశించుచున్నది.

పుట 72 ''ఆశ్వయుజ''

ఆశ్వయుజ చతుర్దశ్యాం = ఆశ్వయుజ, బహుళ చతుర్దశి నాడు, సూర్యోదయాత్‌ పురాభాగే=సూర్యోదయమునకు ముందు యామినీ పశ్చిమభాగే రాత్రి = తుదిజాములో, తైలాభ్యంగః=నువ్వులనూనెతో తలంటి, విధీయుతే = విధింపబడుచున్నది. ( చేసికొనవలయును) దీపావళితిథౌ = దీపావళినాడు, తైలే = నువ్వులనూనెయందు, లక్ష్మీః = లక్ష్మియు, జలే = నీటియందు, గంగా = గంగయు, వసేత్‌= వసించును. అలక్ష్మీపరిహారార్థం= దారిద్ర్యము తొలగుటకు, తైలాభ్యంగో విధీయుతే = నువ్వులనూనెతో తలంటుకొని స్నానము చేయవలయును.

పుట 73 ''ప్రాతఃస్నానం''

యః = ఎవ్వడు, తు = ఐతే, ప్రాతఃస్నానం = సూర్యోదయమునకు పూర్వము స్నానమును; కుర్యాత్‌ = చేయునో, (సః = వాడు) యమలోకం = నపశ్యతి = యమలోకమును చూడడు.

పుట 74 ''అపామార్గం''

స్నానమధ్యేతు = స్నానముచేయుచు మధ్యలో, అపామార్గం = ఉత్తరేణును, తుమ్బీం = ఆనప (సొర)ను, అథ = మఱియు ప్రపున్నాటం = తండెసను, నారకస్య క్షయాయవై = నరకము రాకుండుటకై భ్రామయేత్‌ = శిరసు=మీద త్రిప్పి పారవేయవలయును.

'' ''శీతలోష్ట''

శీతలోష్టసమాయుక్త ! = దున్నిన చాలులోని మట్టి పెళ్ళతోకూడినదానా! సకంటకదళాన్విత! ముళ్ళతో కూడిన ఆకులుకలదానా! అపామార్గ! ఓ ఉత్తరేణూ !పునః పునః = మాటిమాటికి, భ్రామ్యమాణ! త్రిప్పబడుచున్నదానా! పాపంహర= పాపమును పొగొట్టుము.

పుట 74 ''యమాయ''

యమాయ, ధర్మరాజాయ మృత్యవే, చ అంతకాయ చ వైవస్వతాయ, కాలాయ, సర్వభూతక్షయాయ చ, (నమః' యమతర్పణము చేయవలయును, ఔదమ్బరాయ, ధర్మాయ, నీలాయ, పరమేష్ఠినే, మహోదరాయ, చిత్రాయ, చిత్రగుప్తాయ, తే = నీకు, నమః; యమునకి(చిత్రగప్తునికి) తర్పణము-

పుట 75 ''మాషపత్రస్య''

తత్రదినే=ఆరోజున, నరకచతుర్దశినాడు, నరః = మానవుడు; మాషపత్రస్యశాకేన = మినపాకుకూరతో, భుక్త్వా = భుజించి సర్వపాపైః ప్రముచ్యతే = అన్ని పాపములచే విడివడును.

పుట 75 ''అమావాస్యా''

అమావాస్యా చతుర్దశ్యోః = నరకచతుర్దశీదీపావళి అమావాస్యలయొక్క, ప్రదోషే=రాత్రి ప్రారంభకాలమున, దీపదానతః =దీపదానముచేయుటవలన, నరః = మానవుడు, యమమార్గే అధికారేభ్యః = యమమార్గాధికారుల నుండి, ముచ్చతే= విడిపడుచున్నాడు.

పుట 79

భోజ దివంగతే = భోజరాజు స్వర్గస్తుడుకాగా, అద్య = నేడు; ధారా = ధారానగరము నిరాధారా, = ఆశ్రయములేనిది. సరస్వతీ = సరస్వతి, నిరాలమ్బా = ఆలంబనములేనిది; పండితాః ఖండితాః చ ఏవ = పండితులు శోభాహీనులు.

పుట 80 ''అద్యధారా''

భోజరాజే భువంగతే = భోజరాజుభూమిమీదకురాగా అద్య = నేడు, ధారా సదాధారా = ధారానగరము మంచి ఆశ్రయముకలది. సరస్వతీ సదాలమ్బా = సరస్వతి మంచి ఆలంబముకలది, పండితాః మండితాః చ ఏవ = పండితులు శోభకలవారు.

పుట 81 ''సంతాపఘ్నం''

త్రిదశపరిషత్‌ = దేవతలు; సకలజగతాం=సమస్త ప్రాణులకు, సంతాఘ్నం = సంతాపమును పొగొట్టునట్టి, శారఙ్గచాపాభిరామం = శాఙ్ఞ ధనుసు=తో మనోహరమైన, లక్ష్మీవిద్యుల్లసితం = లక్ష్మియనెడి మెఱుపుతో ప్రకాశించుచున్న, అతసీగుచ్ఛ సచ్ఛాయకాయం - అవిసె పుష్పమఞ్జరిని పోలిన దేహకాంతి గల, మునిజన మనశ్చాతకానాం = మునిజనుల మనసు=లనెడి చాతకములకు, శరణ్యం = రక్షకమైన కారుణ్యాపం = దయాజలముకల, వైకుణ్ఠాఖ్యం = వైకుంఠ వాసి శ్రీ మహావిష్ణువనెడి, కాలమేఘం = నీలమేఘమును, దదర్శ = చూచిరి. (పరిషత్తుచూచెను)

పుట 82 ''క్షీరాంభోధేః''

క్షీరాంభోధేః = పాలసముద్రముయొక్క, జఠరం అభితః = మధ్య అంతట, దేహభాసాం = దేహకాంతుల యొక్క, ప్రరోహైః = అంకురములచేత, కాలోన్నీలత్కువలయ దళ##ద్వైతం = వికసించిన నల్లకలువఱకుల అద్వైతభావమును, ఆపాదయంతం = ఆపాదించుచున్న, క్షామగౌరే = చిన్న తెల్లని, భుజగశయనే = శేషతల్పమున, నిఖిల జగతీ రక్షణ = సమస్త ప్రపంచమును రక్షించుటయందు జాగరూకాం = ఏమరుపాటులేని, కామపి = అనిర్వాచ్యమైన, నిద్రాముద్రాం = యోగనిద్రను, ఆతన్వానం = ధరించిన,

'' ''ప్రహ్లాదస్య''

ప్రహ్లాదస్య ప్రహ్లాదునియొక్క, అమితంవ్వసనం = ఘోరమైన ఆపదను, దైత్య వర్గస్య దంభం = రాక్షసులయొక్క పొగరును, స్తంభం = స్తంభమును, రిపోః = శత్రువగు హిరణ్యకశిపునియొక్క, వక్షఃస్థల,మపి=ఱొమ్మను, ¸°గపద్యేన = ఒక్కసారిగా భేత్తుం = చీల్చుటకు, రంహసా = వేగముతో (త్వరగా) పురుషవపుషామిశ్రితే = నరశరీరముతోకలిసిన, విశ్వదృష్టే = అందఱిచే చూడబడిన, దంష్ట్రారోచిర్విశదభువనే= కోరలకాంతిచే తెల్లనైన లోకములుకల, సింహవేషే= సింహము వేషమున, నరసింహరూపమున, బద్ధశ్రద్ధం = మిగుల శ్రద్ధవహించిన;

( 9 - 28 )

పుట 82 ''నారాయణాయ''

నారాయణాయ = జలము నివాసస్థానముగాగల, జీవులకు గమ్మమైన నలినాయత లోచనాయ = పద్మవిశాలనేత్రుడగు, నామావశేషిత మహాబలివైభవాయ= బలిచక్రవర్తి యొక్క మహద్వైశ్వర్యమును, నామమాత్రావశేష మొనరించిన, నానాచరాచర విధాయక జన్మదేశనాభీపుటాయ= స్థావరజజ్గమాత్మక నిఖిల ప్రపంచమును సృష్టించు బ్రహ్మయొక్క పుట్టుకకుస్థానమైన పద్మము నాభిదేశమునందుకల, పరసై#్మపురుషాయ = పరమపురుషుని కొఱకు, నమః = నమస్కారము.

పుట 85 ''తస్మాద్యుధ్యస్వ''

తస్మాత్‌ =అందువలన, భారత! అర్జునా! యుధ్యస్య = యుద్ధముచేయుము.

'' ఆత్మనా = తనచేత, ఆత్మానం = తనను, ఉద్ధరేత్‌ = ఉద్ధరించుకొనవలయును

పుట 86 ''అథపరబ్రహ్మాత్మనా''

అథ = అనంతరము, పరబ్రహ్మాత్మనా = పరబ్రహ్మ స్వరూపముతో, స్థీయాతాం= ఉండుట సంపాదింపబడుగాక.

'' నిజగృహాత్‌ = స్వగృహము నుండి, తూర్ణం = శీఘ్రముగా. వినిర్గమ్యతామ్‌ = బయలువెడల బడుగాక.

'' త్యాగేన = త్యాగముచేత, ఏకే = కొందఱు అమృతత్వం = మోక్షమును, ఆనశుః = పొందిరి

పుట 89 ''శాన్తం''

శాన్తం = శాన్తుడు, పద్మాసనస్థం = పద్మాసనమున ఉన్నవాడు, శశిధరమకుటం = చంద్రుడు కిరీటముగా కలవాడు.

పుట 94 ''ధర్మక్షేత్రే''

ధర్మక్షేత్రే = ధర్మమునకు నిలయమగు, కురుక్షేత్రే = కురుక్షేత్రమున, యుయుత=వః = యుద్ధము చేయగోరిన వారై, సమవేతాః = సమావేశమయిన, మామకాః=నావారును, పాండవాశ్చఏవ = పాండవులును, కిం అకుర్వత = ఏమిచేసిరి? సంజయ = సంజయా!

పుట 107 ''నారాయణం''

నారాయణం = నారాయణుని (పరమాత్మను) నరోత్తమం నరంచ = మానవులలో ఉత్తముడైన నరు (ఋషి)ని, సరస్వతీం దేవీం = సరస్వతీదేవిని, వ్యాసం = వ్యాసుని, నమస్కృత్య = నమస్కరించి, తతః = తరువాత, జయం = భారతమును, ఉదీరయేత్‌ = పఠింపవలయును.

పుట 109 ధర్మక్షేత్రే, 94 లో వ్రాయుబడినది.

పుట యత్ర యొగేశ్వరః 51 లో వ్రాయబడినది.

పుట 111 ''మాతాచ''

మాతా చ పార్వతీదేవీ = తల్లి పార్వతీదేవియు, పితాదేవో మహేశ్వరః = తండ్రి పరమేశ్వరుడును, బాంధవాః శివభక్తాః చ = బంధువులు శివభక్తులును = స్వదేశః = తనదేశము మూడులోకములును.

పుట 121 ''భక్తళ్చయః''

కాకుత్ధ=! ఓశ్రీరామా!భువి = భూలోకమున, యః మానవః = ఏమానవుడు,కార్తికేయే భక్తః చ= కుమారస్వామి భక్తుడు అగునో ఆ మానవుడు, పుత్రపౌత్త్రెః ఆయుష్మాన్‌ చ= దీర్ఘాయుర్దాయముకలవాడు, కుమారులు మనుషులు కలవాడై, స్కందసాలోక్యతాం వ్రజేత్‌ =కుమారస్వామి లోకమును పొందును.

పుట 141 ''భగవాన్‌''

భగవాన్‌సనత్కుమారః = పూజ్యులు సనత్కుమారులు(నారదునకుపదేశించిరి) తం = ఆ సనత్కుమారుని, స్కంద ఇతి = స్కందుడు అని, ఆచక్షతే = చెప్పుచున్నారు.

పుట 142 ''కోబ్రాహ్మణౖః''

బ్రాహ్మణౖః = బ్రాహ్మాణులచేత, ఉపాస్యః = ఉపాసింప తగినవాడు, కః? ఎవ్వడు? గాయత్రీ అర్క అగ్ని గోచరః శంభుః = గాయత్రి సూర్య అగ్ని రూపములలో నున్న శివుడు;

పుట 144 ''యదాసన్నిధానం''

మానవాః = మానవులు, యదా = ఎప్పుడైతే; మే = నాయొక్క సన్నిధానం గతాః = సన్నిధికి వత్తురో; తే = వారు, తదా ఏవ = అప్పుడే, భవాంభోధి పారంగతాః = సంసారసముద్రమునకు ఆవలిగట్టునుచేరిరి.

'' ఇతివ్యఞ్జయన్‌ = అని సూచించుచూ, సింధుతీరే = సముద్రపు టొడ్డున, యః ఆస్తే = ఎవడు ఉంటున్నాడో! తం పవిత్రం పరాశక్తి పుత్రం = ఆ పవిత్ర మూర్తి పరాశక్తితనయుడు సుబ్రహ్మణ్యస్వామిని, ఈడే = స్తుతించుచున్నాను.

యథా = ఏ విధంగా , అబ్ధేః = సముద్రము యొక్క, తరంగాః = తరంగములు, భంగాః = విరిగినవై,(అలలు) లయం యాన్తి = లయము చెందుచున్నవో! తధైవ = అట్లే, మే సేవతాం = నన్ను సేవించువారి యొక్క, ఆపదః = ఆపదలు, సన్నిధౌ = నా సన్నిధిలో (లయము చెందును), ఇతీవ = అన్నట్లు వలె, ఊర్మిషజ్త్కీః = తరంగపంక్తులను, సృణాం = మానవులకు, దర్శయంతం = చూపుచున్న, తం గహం = ఆకుమారస్వామిని, హృత=రోజే = హృదయకమలమున, సదా భావయే = ఎల్లప్పుడు ధ్యానింతును.

పుట 144 ''అహంచాతి''

అహంచ = నేను ఐతే, అతిబాలః = మిగుల చిన్నవాడను, భవాన్‌ = నీవు, లోకతాతః = లోకములకు తండ్రివి; మహేశ! = మహేశ్వరా! సమస్తం అపరాధం క్షమస్వ = నా అపరాధముల అన్నింటిని క్షమింపుము.

పుట 149 ''జయానంద''

ఆనందభూమః పరమానన్దస్వరూపా ! జయ = సర్వోత్కరతో ఉండుము. అపారధామన్‌ = మహాతేజ స్వరూపా! జయ = జయముగాంచుము, అమోఘకీర్తే = మహాకీర్తిశాలీ! జయ = జయింపుము. ఆనందమూర్తే = ఆనందమూర్తీ, జయ, ఆనందసింధో = ఆనందసముద్రా! జయ! అశేషబందో! = నిఖిల ప్రాణులకు బంధువైనవాడా! జయ! త్వం = నీవు, సదా జయ = ఎల్లప్పుడు విజయముగాంచుము. ముక్తిదానేశసూనో = ముక్తినిచ్చు ఈశ్వరకుమారా!


Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page